ఆర్ధిక పుష్టికి ప్రధాని కసరత్తు
న్యూఢిల్లీః దీర్ఘ కాలంగా నలుగుతున్న కేంద్ర మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రధాని వాజ్‌పేయి ఇప్పుడు తమ దృష్టిని ఆర్ధిక రంగంపై సారించారు.
గాడితప్పుతున్న ఆర్ధిక వ్యవస్థను శరవేగంగా పట్టాలపైకి తెచ్చే సంకల్పంతో వున్న ప్రధాని ఇందులో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభించి వరసగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు పద్నాలుగు రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్‌సిన్హా, హోంమంత్రి అద్వానీతో కలసి తమ నివాసంలో వాజ్‌పేయి కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఆర్‌బిఐ గవర్నర్ బిమల్‌జలాన్‌ను కూడా ఆహ్వానించారు. ఆర్ధికాభివృద్ధికి సంబంధించిన కీలకమైన సూచికలు నెగెటివ్ ధోరణిని సూచిస్తుండటంతో ఆందోళనతో వున్న ప్రధాని పరిస్థితిని యుద్ధ ప్రాతిపదికన చక్కదిద్దడానికి తీసుకోవల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
