ఏలూరు రైల్వే స్టేషన్‌లోపేలుళ్లు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరురైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి గం.11.45 నిమిషాలకు ఆగిన ఫలక్‌నుమాఎక్స్‌ప్రెస్‌లోకి టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టుకుని ఎక్కబోతుండగా అవిపేలి ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. పేలుడులో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించివారి వద్ద రెండుసెల్ ఫోన్లు, రెండు 9 ఎంఎం రివాల్వర్లు, నోట్ల కట్టలు దొరికాయి.
సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్‌ఎక్స్‌ప్రెస్ ఏలూరు స్టేషన్‌లోని రెండో నెంబర్ ప్లాట్‌ఫారంపై ఆగింది. కొద్దిసేపటి తర్వాత రైలు కదలబోతుండగా ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై ఉన్న ముగ్గురు యువకులు ట్రాక్‌పైకి దిగి రెండో నెంబర్‌స్లీపర్ బోగీలోకి ఎక్కటానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారి చేతుల్లో ఉన్న టిఫిన్ బాక్స్‌లు జారి కింద పడ్డాయి. ఆ వెంటనేపెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. దీంతో టిఫిన్ బాక్సులను తీసికుని వెళ్తున్న ముగ్గురు యువకులు మరణించారు. బోగీలో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా వుంది.
ఇదిలా వుంటే, మంగళవారంనాడు రాష్ట్ర మంత్రులు ఎన్.ఎం.డి. ఫరూఖ్, దండు శివరామరాజు, కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఏలూరులోనే వున్నారు. సుబ్బారాయుడు మాత్రం గోదావరిఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. పేలుడు గురించి తెలియగానే మంత్రి విద్యాధరరావు, జడ్‌పి చైర్మన్ జయరాజ్‌రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.












Click it and Unblock the Notifications