సినిమాహాలు కూలి నలుగురు మృతి
కోల్ కతాః కోల్ కతాలో ఓ సినిమా హాలు కూలిన దుర్ఘటనలో నలుగురు ప్రేక్షకులు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో తీవ్రం గాయపడ్డారు.
సోమవారం మొదటి ఆట నడుస్తున్న సమయంలో కుంభవృష్టి కురవడంతో పాతకాలం నాటి సొసైటీ సినిమా హాలు బాల్కనీ కుప్పకూలింది.
పలువురు ప్రేక్షకులతో పాటు తినుబండారాలు అమ్ముకొనే వారు శిధిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయ చర్యలు ప్రారంభించి రాత్రి పొద్దుపోయే వరకు నాలుగు మృత దేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలుపెను బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.












Click it and Unblock the Notifications