తమన్ బ్రో...ఆదర్శకుటుంబం సాంగ్‌లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్..!!

దసరా అంటే సినిమా లవర్స్‌కు ఎంతో స్పెషల్. ఈ సీజన్‌లో చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ పండుగ సీజన్‌లో ఇప్పటికే రజినీకాంత్ నటించిన జైలర్-2 రిలీజై బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలువగా...రియల్ లైఫ్ కపుల్ విజయర్ దేవరకొండ-రశ్మిక నటించిన రణబాలి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ లైన్‌లో ఉన్నది ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెంబర్ 47. ఒక చిత్రం హిట్ అయ్యిందంటే... అందుకు కారణం కథతో పాటు నేపథ్య సంగీతం,పాటలు. చాలా సినిమాలు కేవలం మ్యూజికల్ హిట్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు కారణం సంగీత దర్శకులు స్వరపరిచే బాణీలే. తాజాగా వెంకీ మామ నటించిన ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి మేకర్స్ రెండో సాంగ్ మాలా వచ్చా చూడు అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉంది, వెంకీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుందా..?

గల్ఫ్‌లో జైలర్ 2 ఊచకోత.. విజయ్ రికార్డ్ బ్రేక్, ఫస్ట్ వీకెండ్‌కి ఎన్ని కోట్లంటే?
గల్ఫ్‌లో జైలర్ 2 ఊచకోత.. విజయ్ రికార్డ్ బ్రేక్, ఫస్ట్ వీకెండ్‌కి ఎన్ని కోట్లంటే?

మాలా వచ్చా చూడు ఎలా ఉంది..?

విక్టరీ వెంకటేష్ శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ఆదర్శకుటుంబం హౌజ్ నెంబర్ 47(AK-47). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతోంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ తీస్తున్నారు. అందులో తప్పకుండా సందర్భం ఉన్నా లేకున్నా ఒక ఐటెం సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకీ మామ నివేత పేతురాజ్‌లపై ఆదర్శ కుటుంబంలో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. పండగ సీజన్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతోన్న ఈ చిత్రంలోని "మాలా వచ్చా చూడు"అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంలోని సాంగ్ సాహిత్యం పరంగా బాగానే ఉన్నా..స్వరపరిచిన విధానంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయిన ఈ సాంగ్‌లో పెద్దగా ఊపు కనిపించలేదు. దీంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో తమన్ పై అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' సునామీ: 3 రోజుల్లోనే ఇన్ని వందల కోట్లా?
బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' సునామీ: 3 రోజుల్లోనే ఇన్ని వందల కోట్లా?
Thaman disappoints fans with the second song Mala vacha choodu from Venkatesh starrer Aadarsha Kutumbam

సంథింగ్ ఈజ్ మిస్సింగ్..

తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు సినిమాల్లో మంచి బీట్ ఉన్న ఐటెం సాంగ్స్ అందించాడు. ఇప్పటికీ ఆ పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంలోని పాట, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలోని కుర్చీ మడత పెట్టి, అల వైకుంటపురంలో అల్లు అర్జున్ ఇరగదీసిన బుట్టబొమ్మ సాంగ్ ఇలా మంచి ఊపున్న ట్యూన్స్ తమన్ అందించాడు. అయితే నిన్న రిలీజ్ అయిన వెంకీ మామ ఆదర్శ కుటుంబం చిత్రంలోని స్పెషల్ సాంగ్ మాలా వచ్చా చూడుకు మాత్రం అనుకున్న స్థాయిలో మ్యూజిక్ అందించలేకపోయాడనేది సినీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. అంతకుముందు వచ్చిన నారాయణమ్మ సాంగ్ కూడా జనాల్లోకి అంతగా చొచ్చుకుపోలేకపోయింది. దీంతో రెండవ సాంగ్ మాలా వచ్చా చూడు అనేదానిపై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇది కూడా నిరుత్సాహ పరిచినట్లు సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.

ఇంకా కనిపించని బజ్

ఇదంతా ఇలా ఉంటే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఆదర్శకుటుంబం చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గురూజీ రాసే డైలాగులకు వెంకీ మామ నటన తోడైతే ఆ కిక్కే వేరుంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. వెంకటేష్ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ. మ్యూజిక్ విషయం అటుంచితే కథా కథనం పరంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పనప్పటికీ ఈ నెలాఖరుకు విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఫిలింనగర్‌లో వార్త షికారు చేస్తోంది. అదేకనుక నిజమైతే ఇంకా ప్రమోషన్స్ బిగిన్ కాకపోవడం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఒకవేళ ప్రమోషన్స్ ఆలస్యమైన చిత్రంపై బజ్ పెరగాలంటే సాంగ్స్ కీలకంగా మారుతాయి. కానీ తమన్ స్వరపరిచిన ఈ రెండు పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.కొన్ని సందర్భాల్లో పాటలు బాగలేకపోయినా.. స్టోరీ స్ట్రెంత్, చిత్రాన్ని తీసిన విధానం బాగుంటే ఆ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఉదంతాలున్నాయి. మరిచూడాలి.. ఆదర్శకుటుంబం కూడా ఈ కోవలోకే వస్తుందా లేదా అనేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+