సూర్య కొత్త సినిమా కథ లీక్? పాత బ్లాక్‌బస్టర్‌నే మళ్లీ తీస్తున్నారా?

కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా వరుస విజయాల అనంతరం స్టార్ హీరో సూర్య నటించిన తదుపరి సినిమా 'సీన్'. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. 'ఆవేశం' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జిత్తు మాధవన్ కాంబినేషన్లో వస్తుండటం, అలాగే మలయాళ యంగ్ యాక్టర్ కోలీవుడ్‌కు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి.

'కాకా' సెట్స్ నుంచి లీకైన వీడియో.. వింటేజ్ స్వ్యాగ్‌తో ఊపేస్తున్న మెగాస్టార్!
'కాకా' సెట్స్ నుంచి లీకైన వీడియో.. వింటేజ్ స్వ్యాగ్‌తో ఊపేస్తున్న మెగాస్టార్!

ఈ నేపథ్యంలో 'సీన్' సినిమా కథేంటో చెబుతూ ఓ సినాప్సిస్ సోషల్ మీడియాలో లీక్ అయి తెగ వైరలవుతోంది. ఆ వార్తల ప్రకారం.. ఈ సినిమాలో సూర్య 'ఇన్బరాజ్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, గతంలో తను వదిలేసిన ఓ పాత కేసును మళ్లీ రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేసే కథాంశంతో ఇది రూపొందిందని టాక్ నడుస్తోంది. ఆ కేసు వల్ల ఇన్బరాజ్ జీవితంలో వచ్చే కొత్త సవాళ్లు, ఆ తర్వాత జరిగే పరిణామల చుట్టూ కథ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది.

Suriya Scene Movie Story Leaked Is It Inspired by the Blockbuster Kaakha Kaakha Full Details Here

అయితే లీక్ అయిన కథాంశంపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. ఇది చాలా పాత తరహా కథలా ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. 2003లో వచ్చిన సూర్య ఐకానిక్ హిట్ 'కాక కాక'(తెలుగులో ఘర్షణ) సినిమాను కూడా ఈ ప్లాట్ గుర్తుచేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. స్టోరీ కొత్తదనం లేకపోతే, సినిమా విజయం కేవలం స్క్రీన్‌ప్లే పైనే ఆధారపడి ఉంటుందని, కథనంలో ఏమాత్రం తడబడినా రిస్క్ తప్పదని విశ్లేషిస్తున్నారు.

'రణబాలి' రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ షాకింగ్ నిర్ణయం.. ఇకపై..
'రణబాలి' రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ షాకింగ్ నిర్ణయం.. ఇకపై..

మకోవైపు డైరెక్టర్ జిత్తు మాధవన్ మేకింగ్‌పై అభిమానులకు పూర్తి నమ్మకం ఉంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ తనదైన మార్క్ యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో జిత్తు మాధవన్ ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా మలచి ఉంటారని, ఈ సినిమాతో సూర్య హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆశిస్తున్నారు. కాగా లీక్ అయిన ఈ స్టోరీపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నవంబర్ 6న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+