నేడు దహనం అయ్యేది కాక్రోచ్ దిష్టిబొమ్మ కూాడా..!!

ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఓ వినూత్న ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రతి ఏటా దసరా పండుగ రోజున రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈసారి భారీ కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం కాబోతోంది. ఢిల్లీ పీతాంపుర రామ్ లీలా మైదాన్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా.

సమాజం, ఇళ్లు, పరిసరాల్లోనూ పేరుకుపోయిన మురికిని, అపరిశుభ్రతను అంతం చేయాలనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ ఏడాది నూతనంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని నిర్ణయించినట్లు శ్రీ కేశవ్ రామ్ లీలా కమిటీ ఇదివరకే వెల్లడించింది. దీనికి అనుగుణంగా రామ్ లీలా మైదాన్ లో ఈ ఉదయం ఆయా దిష్టిబొమ్మలను ఆవిష్కరించింది కూడా.

Ramlila Committee is set to burn unique 30-foot cockroach effigy alongside effigies of Ravana Delhi

విజయదశమి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అధర్మంపై ధర్మానికి కలిగిన గెలుపును చాటిచెప్పే పవిత్రమైన రోజని, అలాగే సమాజంలో, ఇళ్లల్లో బొద్దింకలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ను రూపొందించినట్లు కమిటీ ఛైర్మన్, ఢిల్లీ మోడల్ టౌన్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయెల్ దేవరహ చెప్పారు. యుగయుగాలుగా రావణ, కుంభకర్ణ, మేఘనాథుల ప్రతిమలను దహనం చేస్తూ వస్తోన్నామని, దీనివల్ల చివరికి సత్యమే జయిస్తుందనే సందేశాన్ని ఇస్తున్నామని గుర్తుచేశారు.

పండగ వేళ.. పసిడి ధరల్లో షార్ప్ క్రాష్- భారీ గిరాకీ.. !!
పండగ వేళ.. పసిడి ధరల్లో షార్ప్ క్రాష్- భారీ గిరాకీ.. !!

అదే బాటలో నేటి సమాజానికి హాని కలిగిస్తున్న అపరిశుభ్రతను కూడా ఒక పెద్ద చెడుగా పరిగణించి, దానికి చిహ్నంగా బొద్దింక రూపాన్ని ఎంచుకున్నామని దేవరహ వివరించారు. దేశాన్ని వేధిస్తున్న అనేక రకాల సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తమ ప్రయత్నిస్తుంటుందని వివరించారు. నక్సలిజం, తీవ్రవాదం వంటి సామాజిక, జాతీయ రుగ్మతలకు ప్రతీకగా దిష్టిబొమ్మలను దహనం చేసిన చరిత్ర తమకు ఉందని గుర్తుచేశారు.

ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్
ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్

ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, ఈసారి ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న పారిశుధ్య లోపాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నామని, మురికిని పూర్తిగా నివారించాలనే ఉద్దేశంతోనే కాక్రోచ్ దిష్టిబొమ్మను అమర్చినట్లు పేర్కొన్నారు. పీతాంపుర నేతాజీ సుభాష్ ప్లేస్ గ్రౌండ్స్‌లో ఈ 30 అడుగుల భారీ బొద్దింక దిష్టిబొమ్మ రూపుదిద్దుకుంది.

'రెజిమ్' ఛేంజ్ ద్వారా పరిస్థితులు ఏమాత్రం మారవు: బలహీనపడతాం: తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్
'రెజిమ్' ఛేంజ్ ద్వారా పరిస్థితులు ఏమాత్రం మారవు: బలహీనపడతాం: తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ వివిధ సామాజిక అంశాలపై ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీక్ తర్వాత కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలనే డిమాండ్ పై ఆందోళనలను చేపట్టింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే, నేహా బోరా, సౌరవ్ దాస్.. వంటి యువ నాయకులు దీనికి నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ఈ పరిస్థితుల్లో కాక్రోచ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+