తెలంగాణా వాకిట్లోకే విదేశీ విద్య.. ఫ్యూచర్‌ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలకు 250 ఎకరాలు!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మార్చే ప్లాన్ లో ఉంది. దీనికోసం ప్రపంచ ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఫ్యూచర్‌ సిటీలో 250 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఒక్కో ఆఫ్‌క్యాంపస్‌కు 20 నుంచి 25 ఎకరాల చొప్పున మొత్తం పది విదేశీ విశ్వవిద్యాలయాలకు స్థలం కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

విదేశీ విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ విదేశీ విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో, స్థలం ధర ఎంత ఉండాలో, మౌలిక వసతులు ఎలా ఏర్పాటు చేయాలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటోంది. డిసెంబర్ లో జరగనున్న గ్లోబల్‌ సమ్మిట్ నాటికి ఈ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో కాలు పెట్టేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందించనున్నారు.

Telangana foreign universities Telangana Allocates 250 Acres in Future City for 10 Foreign University Campuses

ఒక్కో విశ్వవిద్యాలయానికి వేర్వేరు రాయితీలు కాకుండా, ఏకరూపమైన ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 500లోపు ఉన్న విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ భారత్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా ఉన్నత స్థాయిని లక్ష్యంగా పెట్టుకుంది.

200 ర్యాంకులలోపు ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను తీసుకురావాలని భావిస్తోంది. ప్రధానంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్‌ విశ్వవిద్యాలయానికి యూజీసీ నుంచి ప్రాథమిక అనుమతి లభించింది. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంతో పాటు మరో నాలుగు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఫ్యూచర్‌ సిటీలో క్యాంపస్‌ ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

స్థలం, రాయితీలు ఇచ్చేటప్పుడు కేవలం ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు మాత్రమే కాకుండా భవిష్యత్తులో డిమాండ్‌ ఉండే కొత్త తరం కోర్సులు, ఉద్యోగ నైపుణ్యాలు పెంచే సిలబస్‌ ఉన్నాయా అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం విదేశీ విద్యానిధి కింద రెండేళ్లకు రూ.20 లక్షలు అందిస్తోంది.

ఇప్పుడు అదే విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోనే క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నందున, ఇక్కడ చేరే విద్యార్థులకు కూడా ప్రభుత్వమే ఫీజు భరించే అవకాశం ఉందని సమాచారం. ఒకే ప్రాంతంలో పది విశ్వవిద్యాలయాలు ఉండబోతున్నందున ఆట స్థలాలు, స్టేడియం, లైబ్రరీ, ఇతర సామాజిక సౌకర్యాలను ఉమ్మడిగా వినియోగించుకునే విధానంపై కూడా కమిటీ చర్చలు జరుపుతోంది.

దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!
దసరా డిమాండ్.. చికెన్ ధరలకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లు ఇవే!

దీంతో తెలంగాణ విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండానే ప్రపంచ స్థాయి విద్య అందుకునే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విద్యా హబ్‌గా ఎదగడంతో ఉపాధి అవకాశాలు, పరిశోధనా కార్యకలాపాలు, విదేశీ పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన పాలసీని విడుదల చేస్తే, ఫ్యూచర్‌ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+