గంగూలీ,సచిన్ సెంచరీలు-భారత్ 279/5
జొహన్నెస్ బర్గ్‌ః భారత కెప్టెన్ సౌరభ్ గంగూలీ, మాస్టర్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్ విజృంభించారు. ఇద్దరూ సెంచరీలు సాధించి భారత్ భారీస్కోరుకు తోడ్పడ్డారు. సౌతాఫ్రికాతో శుక్రవారం జరుగుతున్న ట్రయాగ్యులర్ సిరీస్ తొలి మ్యాచ్ లో గంగూలీ అద్భుతంగా ఆడి 126 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన గంగూలీ 14 ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లతో ప్రేక్షకులను అలరించారు. సచిన్ ఆ తరువాత పరుగుల వరద పారించాడు. 130 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇది సచిన్ సాధించిన 30 వ సెంచరీ. సచిన్ సెంచరీలో 9 ఫోర్లు వున్నాయి.
ఏ దశలోనూ రన్ రేట్ 5 కు తగ్గకుండా ఓపెనర్లు ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. గంగూలీ ధాటిగా ఆడి భారత్ స్కోరు 197 పరుగుల వద్ద వుండగా భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన వైస్-కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కేవలం ఒక పరుగు వద్దే భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తరువాత స్కోరును నడిపించే భారాన్ని భుజాన వేసుకున్న సచిన్ చక్కని ఆట తీరు ప్రదర్శించాడు.












Click it and Unblock the Notifications