కోస్తాలో గ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ రెడీ
హైదరాబాద్‌ః కోస్తా ప్రాంతంలోపెద్ద ఎత్తున గ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ సంస్థ భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా రిలయన్స్ అధికారులు శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర ఉన్నతాధికారులను కలుసుకున్నారు. కోస్తా లోని 8 బ్లాకుల్లో గ్యాస్ ను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడేళ్ళలో ఈ ప్రాంతం నుంచి 5 లక్షల ఘనపుమీటర్ల గ్యాస్ ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రిలయన్స్ ప్రణాళిక రూపొందించింది.
కోస్తాలో ఉత్పత్తి చేసిన గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు కూడా సరఫరా చేయాలని రిలయన్స్ భావిస్తున్నది. రిలయన్స్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.వి.రావు ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు.












Click it and Unblock the Notifications