ప్రతీకార దాడులకు అల్‌ఖైదా హెచ్చరిక
న్యూయార్క్‌ఃఅఎn్గాన్‌పై అమెరికా దాడులతో ఒసామాబిన్ లాడెన్‌సారథ్యంలోని అల్‌ఖైదా రెచ్చిపోతున్నది. మరిన్ని విమానదాడులతో అమెరికాను అల్లకల్లోలం చేస్తామని అల్‌ఖైదా ఉగ్రవాదులు అమెరికాకు సవాలువిసిరారు.
అల్‌ఖైదా ప్రతినిధి ప్రసంగాన్ని అల్ జజీరా టీవీ ప్రత్యక్ష్యంగా ప్రసారం చేసింది. ఎక్కడి నుంచి ఈ ప్రసారం చేశారు, ఈ తీవ్రవాద ప్రతినిధికి అల్‌ఖైదాలో ఎటువంటి స్థానం వున్నది తదితరవివరాలను మాత్రం వెల్లడించలేదు. న్యూయార్క్‌పై దాడులు జరిపిన యువకులు త్యాగం మహత్తరమైందని ఈ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
అమెరికాకు వ్యతిరేకంగాజిహాద్ ప్రారంభించడం సత్యనిష్టగల ప్రతిముస్లీం బాధ్యత అనిపేర్కొన్నారు. అమెరికాపై తాము దాడులను నిలిపివేయాలంటే పశ్చిమాసియా నుంచి అమెరికా బలగాలు వెనుతిరగాలని, ఇజ్రాయెల్‌కు మద్దతు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కరుడుకట్టిన ఇస్లాం వ్యతిరేకతతో అమెరికా ఈ దాడులకు పాల్పడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. అల్‌ఖైదా నేరుగా చేసిన ఈ హెచ్చరికలతో అమెరికా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications