ఆంత్రాక్స్ భయంలో అమెరికా
వాషింగ్టన్‌ః ఉగ్రవాదులు ప్రమాదకర జీవాయుధాలను ప్రయోగించివుంటారన్న అనుమానాలతో అమెరికా వణికిపోతున్నది. అంత్రాక్స్ అనే శక్తిమంతమైన జీవ ఆయుధాన్ని ఉగ్రవాదులు ప్రయోగించివుంటారనే వార్త అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్నది.
అంత్రాక్స్ కారణంగా సోకే వ్యాధి లక్షణాలతో ఫ్లోరిడా టాబ్లాయిడ్ పబ్లిషింగ్ కంపెనీలో పనిచేసే ఒక ఫోటో జర్నలిస్టు మరణించడంతో ఈ భయాలు విపరీతంగాపెరిగిపోయాయి. లాడెన్‌కు వ్యతిరేకంగా ఈ టాబ్లాయిడ్ విపరీత కథనాలు అనేకం ప్రకటించింది. లాడెన్‌కు మాదకద్రవ్యాలకు బానిస అని, సామూహిక మానభంగాలకు పాల్పడుతుంటాడని, పచ్చి హిపోక్రట్ అనిపేర్కొంది.
మరణించిన ఫోటో జర్నలిస్టు రాబర్ట్సస్టీవెన్స్ ఉపయోగించే కంప్యూటర్ కీ బోర్డుపైఅంత్రాక్స్ అవశేషాలను ఎఫ్‌బిఐ కనుగొంది. తక్షణమే ఈ భవనాన్ని గాలి కూడా చొరబడిని రీతిలో దిగ్బంధం చేశారు.స్టీవెన్స్ సహఉద్యోగి మరొకరికి కూడా అంత్రాక్స్ సోకడం అమెరికాను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ఆధునిక యుద్ధంలో అమెరికాను జయించడం ఏనాటికీ సాధ్యం కాదన్నవిషయం తెలిసిన ఉగ్రవాద మూకలు మొదటి నుంచి జీవ, రసాయన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్టుగా పుకార్లు వున్నాయి.అంత్రాక్స్ సోకిన వారిలో 90 శాతం మంది మరణించే అవకాశం వుంది. వ్యాధి నిర్ధారించే లోపలే మరణం సంభవిస్తుంది.అంత్రాక్స్ రవాణా, ప్రయోగం చాలా సులభమని శాస్త్రవేత్తలుఅంటున్నారు యావత్ అమెరికా జనాభాను తుడిచిపెట్టడానికి కిలోఅంత్రాక్స్ సరిపోతుందని వారు చెబుతున్నారు. వర్జినియాలో ఒక వ్యక్తి ఇప్పటికేఅంత్రాక్స్ వల్ల మరణించినట్టుగా అమెరికా ప్రకటించింది.












Click it and Unblock the Notifications