అమెరికా స్పై విమానం కూల్చిన ఇరాక్
బాగ్దాద్‌ః అమెరికాకు చెందిన ఓ గూఢచారివిమానాన్ని ఇరాక్ పేల్చి వేసింది. బాగ్దాద్ దక్షణ ప్రాంతంలో అమెరికా గూఢచారివిమానాన్ని కూల్చి వేసినట్లు ఇరాక్ టెలివిజన్ బుధవారం ప్రకటించింది. కూల్చి వేసిన గూఢచారివిమానం శకలాలను కూడా టెలివిజన్ లో చూపుతామని కూడా ఇరాక్ ప్రకటించింది.
ఆగస్ట్ 27న అమెరికాకు చెందిన ఓ గూఢచారివిమానాన్ని ఇరాక్ పేల్చి వేసింది. మరోవైపు యుద్ధం జరుగుతుండగా తమ గగనతలంలో తిరుగుతున్న మరో గూఢచారివిమానాన్ని ఇరాక్ పేల్చి వేయడం విశేషం. గతంలో ఇరాక్ వద్ద గగనతల సంరక్షణ పరికరాలు నామమాత్రంగానే వున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాక్ వద్ద అత్యంత అధునాత గగనతల సంరక్షణ పరిజ్ఞానం వున్నదనే అమెరికా అనుమానాలు బలపడ్డాయి.












Click it and Unblock the Notifications