నాన్ స్టాప్ దాడులకు అమెరికా రెడీ
ఇస్లామాబాద్‌ః గత మూడు రోజులుగా ఎంపిక చేసుకున్న సమయాల్లో దాడులు చేస్తున్న అమెరికాసేనలు బుధవారం నాడు ఆఫ్ఘన్ గగనతలం నుంచి ఎడతెరిపి లేకుండా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. గగన తలంలో బాగా ఎత్తు నుంచి మాత్రమే అమెరికావిమానాలు క్షిపణులు జారవిడుస్తున్నాయి. భూభాగం సమీపం నుంచి దాడులు ప్రారంభిస్తే తాలిబన్‌విమాన విధ్వంసక క్షిపణులకు బలికావలసి వస్తుందనే ఆలోచనతో బాగా ఎత్తు నుంచే ఇప్పటి వరకు అమెరికా,బ్రిటన్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి.
భూతలానికి సమీపం నుంచి దాడులు నిర్వహిస్తేనే పదాతి దళాలు రంగంలోకి దిగేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే ఇప్పట్లో తక్కువ ఎత్తు నుంచి దాడులు నిర్వహించే ఆలోచనలో అమెరికా లేనట్లు కనిపిస్తున్నది. ఆఫ్ఘన్ గగనతలంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు మాత్రం అమెరికా ప్రకటించుకుంది. ఇకమీదట నిరంతరం దాడులు జరిపే అవకాశం ఏర్పడిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి డొనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం కూడా నాలుగు యుద్ధవిమానాలు ఆఫ్ఘనిస్తాన్ పై క్షిపణులు కురిపిస్తున్నాయని సమాచారంఅందింది.












Click it and Unblock the Notifications