కర్ణాటకలో అంత్రాక్స్‌ మరణాలు

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ఆరువారాల క్రితం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్‌ఐసిడి)కి చెందిన యు.వి.యస్‌. రాణా చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా అలగుర్ఖి గ్రామంలోఅంత్రాక్స్‌కు ఇద్దరు వ్యక్తులతో పాటు 20 గొర్రెలు, ఒక ఎద్దు, రెండు ఆవులు మరణించినట్లు ఆయన తెలిపారు.
జీవరసాయనాల యుద్ధ ప్రమాదాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన నివేదిక సమర్పించారు.అంత్రాక్స్‌కు గురై మరణించిన పశువుల మాంసం తినడం వల్ల వ్యక్తులకు ఆ వ్యాధి సోకిందని ఆయన చెప్పారు. యేటా భారతదేశంలో ఈ వ్యాధి వస్తుందని,అంత్రాక్స్‌ సోకిన పశువుల మాంసం తినడం వల్ల వ్యక్తులకు ఈ వ్యాధి వస్తోందని ఆయన చెప్పారు.

ఇటీవల ఎన్‌ఐసిడి ఎనిమిది కేసులు నమోదు చేసిందని, మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో గల ఒక తండాలో 1999 జులైలో ఐదు మరణాలు సంభవించాయని, మిడ్నాపూర్‌ జిల్లాలోని బంధుగుట్టు గ్రామంలో 2000 మేలోఅంత్రాక్స్‌ వల్ల రెండు వేల పశువులు, మేకలు, పందులు చనిపోయాయని,వీటి మాంసం తిన్న 43 మందికి అంత్రాక్స్‌ సోకిందని, ఇందులో ముగ్గురు మరణించారని ఆయనవివరించారు.

ప్రస్తుతం అంత్రాక్స్‌ భారతదేశంలో పశు సంపదకు మాత్రమే సోకుతోందని, వ్యాధి నిరోధక టీకాలు సరిగా ఇప్పించకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తోందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+