రాష్ట్రంలో రెడ్ అలర్ట్
హైదరాబాద్‌ః అఎn్గాన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు, ఇంటలీజెన్స్ వర్గాలను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కూడా ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం వున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా రాష్ట్ర హోం మంత్రి దేవేందర్ గౌడ్ చెప్పారు.
విమానాశ్రయాలు, జనం అధికంగా సంచరించే ప్రాంతాలు కీలకమైన ప్రభుత్వ సంస్థలు, రక్షణ సంస్థల వద్ద భద్రతనుపెంచినట్టుగా ఆయన వెల్లడించారు. పరిస్థితి సున్నితమైనదనివిపక్షాలు కూడా బాధ్యతారహితంగా
ప్రకటనలు చేయకుండా ప్రభుత్వంతో సహకరించాలని ఆయనకోరారు.
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)ని కేంద్ర ప్రభుత్వం నిషేంధించిన తర్వాత రాష్ట్రంలో 23 మంది సంస్థ కార్యకర్తలనుఅరెస్టు చేసినట్టుగా మంత్రి తెలిపారు. పోలీసుల్లో కూడా మతోన్మాదులు ఉన్నారని బిజెపి నేత ఒకరు ప్రకటించినట్టుగా వచ్చిన వార్తను ఆయన ఖండించారు. ఇలాంటి ప్రకటనలు పరిస్థితి విషమించడానికే తప్ప మెరుగుపడేందుకు దొహదం చేయవని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications