అఎn్ఘాన్‌లో అమెరికా దాడులు తీవ్రం
కాబూల్: కాందహార్‌పై అమెరికా దాడులు కొనసాగుతూనే వున్నాయి. గురువారం ఉదయం కూడా కాందహార్‌పై అమెరికా దాడులు కొనసాగించింది. ఈ దాడులు ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుతాయని అమెరికా వర్గాలంటున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్, ఆల్ ఖైదా తీవ్రవాదుల స్థావరాలు ఈ ప్రాంతంలో వుండడంతో అమెరికా తన దాడులను కాందహార్‌పై కేంద్రీకరించింది. ప్రత్యేక దళాలు కూడా రంగ ప్రవేశం చేస్తాయని అమెరికా ప్రకటించింది. లాడెన్‌ను పట్టుకునేందుకు కమెండోలు కొండల్లోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.
అమెరికా బలగాలు కురిపించిన బాంబు దాడులకుజలాలాబాద్‌లోని ఒక మసీదు ధ్వంసమైంది. దేశవ్యాప్తంగా పలువురు పౌరులు మరణించినట్లు తాలిబాన్ విద్యామంత్రిఅమీర్ ఖాన్ ముతక్కి ప్రకటించారు. జలాలాబాద్‌లో, కాందహార్, కాబూల్‌లలోపెద్ద యెత్తున ప్రాణ నష్టం సంభవించిందని ఆయన చెప్పారు.
కాబూల్‌లో అమెరికా బాంబు దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన పది మంది చనిపోయినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications