సుప్రీం కొత్త ఛీఫ్ జస్టిస్ బరూచా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్.పి. బరూచాను నియమిస్తూ రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ప్రకటించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్. ఆనంద్ ఈ నెల 31వ తేదీనరిటైరవుతారు. జస్టిస్ శ్యాం పిరోజ్ భరూచా (64) ముఖ్యమంత్రిగా అన్నాడియంకె నేత జయలలిత నియామకాన్ని కొట్టేస్తూ ఇటీవల చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించారు.
బరూచా 1992లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన ముంబాయి హైకోర్టులో న్యాయవాదిగా, అదనపు జడ్జిగా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తన సుదీర్ఘమైనసర్వీసులో బరూచా అనేక కీలక తీర్పులు వెలువరించారు.












Click it and Unblock the Notifications
