200 మంది బలి
కాబూల్‌ః అమెరికా విచక్షణరహితంగా సాగిస్తున్న దాడులకు ఇప్పటికే 300 మందిపైగా అమాయక పౌరులు మరణించినట్టుగా తాలిబన్లు ప్రకిటంచారు. బుధవారం నుంచి ముమ్మరంగా సాగిస్తున్న దాడుల్లోనే కనీసం 200 మంది మరణించినట్టుగా తాలిబన్లు వెల్లడించారు.
లాడెన్ శిబిరం వున్నదన్న అనుమానంతో కాదమ్ గ్రామంపై అమెరికాసేనలు భారీ ఎత్తున బాంబులు వేసినట్టుగా వారు ఆరోపించారు.జలాలాబాద్‌కు తూర్పున 40 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ గ్రామంపైనే అమెరికా తన దృష్టినంతా కేంద్రీకరించి తొలిరోజునుంచి దాడులు జరుపుతున్నది. అడవుల్లోకి కొండల్లోకి పారిపోతున్న ప్రజలను కూడా అమెరికా యుద్ధవిమానాలు విడవడం లేదు.
కాందహార్, కాబూల్ వంటి అనేక పట్టణాల్లో పౌరులు మరణించినట్టుగా వారు వెల్లడించారు. అంతర్జాతీయ పాత్రికేయులపై అనేక ఆంక్షలను తాలిబన్లు విధించిన కారణంగా వారు చెబుతున్నవివరాలను ధృవీకరించే అవకాశం కనిపించడం లేదు. అమెరికా మాత్రం తాముఅంగుళం కూడా గురితప్పకుండా తాలిబన్ల సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications