ప్రపంచ సదస్సుకు ఒఐసి పిలుపు
దొహాః టెర్రరిజంపై అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయాలని ఇస్లాం దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితిని కోరింది. న్యూయార్క్‌పై గత నెల 11న టెర్రరిస్టులన దాడులను దొహాలో జరిగిన 56 ఇస్లాం రాజ్యాల సదస్సు తీవ్రంగా ఖండించింది. అమెరికా పై జరిగిన దాడులను ఖండిస్తూనే ఇస్లాం రాజ్యాలకు, పశ్చిమ దేశాలకు మధ్య అర్ధవంతమైన చర్చలకు పిలుపునిచ్చింది.
అంతర్జాతీయ చట్టాల కింద ఐక్యరాజ్య సమతి సభ్య దేశాలసార్వభౌమత్వానికి భంగం కలగకుండా అంతర్జాతీయ టెర్రరిజాన్ని తుదముట్టించాలని ఇస్లాం దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈవిషయంలో సమితి నడుం కట్టి ఒక సదస్సును ఏర్పాటు చేయాలని దేశాలు పిలుపునిచ్చాయి. టెర్రరిజానికి పాలస్తీనా, లెబనాన్‌కు సంబంధించి ముస్లీంలు,అరబ్‌ల న్యాయబద్దమైన హక్కులకు ఏమాత్రం సంబంధం లేదని సదస్సు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలను ఇజ్రాయెల్ తనకు అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదని సదస్సు హెచ్చరించింది.అఎn్గాన్లకు సాయం చేయడానికి ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications