ప్రపంచ ముస్లీంలకు ఒమర్ పిలుపు
కాబూల్‌ః అఎn్గానిస్తాన్ పై అమెరికా దాడులు ప్రారంభమైన తర్వాత అయిదు రోజులకుతాలిబన్ల అగ్రనేత ముల్లా ఒమర్ గళం విప్పారు. అమెరికా దాడులపై నిప్పులు చెరుగుతూ, అమెరికాకు వ్యతిరేకంగా జిహాద్ ప్రారంభించాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా వున్న ముస్లీంలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇస్లాం దేశమైనఅఎn్గానిస్తాన్‌కు చేతనైనంత సాయం చేయాలని ముల్లా ఒమర్‌కోరారు. ఇదిలా వుండగా గగనతలం అమెరికా పట్టు సాధించగానే సరిపోదని భూతల యుద్ధంలో తమ సత్తా చూపిస్తామని తాలిబన్లు ప్రకటించారు. భూతల యుద్ధంలో అమెరికాను చావుదెబ్బతీస్తామని వారు తెలిపారు. ఇస్లాం దేశాల మద్దతు కోరుతూ కూడా తాలిబన్లు లేఖరాశారు.












Click it and Unblock the Notifications