టెర్రరిజంపై ఉక్కుపాదం
న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు ప్రారంభించింది. అవసరమైతే పాకిస్తాన్‌పై సైనిక చర్యకు దిగేవిషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో వుంది.
ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు వారణాసిలో ఈవిషయం చెప్పారు. ఉగ్రవాదుల అణిచివేతకు మరింతపెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా చేసిన సూచనలకు ఆయన సానుకూలంగా ప్రతిస్పందించారు. టెర్రిరిస్టులను ఏరివేయడానకివీలుగా పాక్‌పై యుద్ధం ప్రకటించాల్సిందిగా ఫరూఖ్ చేసిన సూచనపట్ల కేంద్రం వ్యతిరేకంగా లేదని ఆయన వెల్లడించారు.
ఇస్లాం వేరు, ఉగ్రవాదం వేరన్నవిషయం గుర్తించాలని ఆయన చెప్పారు. కొన్ని ఇస్లాం దేశారు ఉగ్రవాదాన్ని పవిత్రయుద్ధంగా వర్ణిస్తూ ప్రకటనలు చేస్తున్నాయని ఇది ఆ దేశాలకే ప్రమాదమని వాజ్‌పేయి హెచ్చరించారు. ఉగ్రవాదం జడలు విప్పితే దానికి ఉచ్ఛనీచాలు వుండవనిఅందరినీ అది కబళిస్తుందని ఆయన చెప్పారు. బాలియాలో జరుగుతున్న లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లేముందు ఆయనవిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదం మానవతను పరిహసించే దానవత్వమని అది ఏ దేశంలోనైనా, ఏ సమయంలోనైనా తలెత్తే అవకాశం వున్నదని వాజ్‌పేయి చెప్పారు.












Click it and Unblock the Notifications