కరెంట్ వెతలు నెలరోజుల్లో ఖతం
హైదరాబాద్‌ః రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కుంటున్న విద్యుత్ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించనున్నట్టుగా విద్యుత్ శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విద్యుత్ వినియోగదారుల వారోత్సవాల ముగింపు సందర్భంగా కర్నూల్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
ఈ వారంలో కనీసం 40 వేల సమస్యలను పరిష్కరించినట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్ శాఖ అధికారులు కనీసం 29 వేల ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులుస్వీకరించినట్టుగా ఆయన వెల్లడించారు. లో వోల్టేజీ, తప్పుడు బిల్లులు ప్రధాన ఫిర్యాదులుగా వున్నాయని నెలరోజుల్లో ఈ సమస్యలను తాము పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications