ఒమర్‌, లాడెన్‌ క్షేమం: తాలిబాన్‌

కాబూల్‌: తాలిబాన్‌ నేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌, ఒసామాబిన్‌ లాడెన్‌ క్షేమంగా వున్నారని తాలిబాన్‌ విద్యా మంత్రిఅమీర్‌ ఖాన్‌ ముతక్కి చెప్పారు. రాత్రి జరిగిన అమెరికా దాడుల నుంచి వారు తమను రక్షించుకున్నారని ఆయన అన్నారు. దాడుల్లో పలువురు పౌరులు మరణించినప్పటికీ లాడెన్‌, ఒమర్‌లకు ఏమీ జరగలేదని ఆయన అన్నారు.

లాడెన్‌, ఒమర్‌ క్షేమంగా వున్నట్లు తనకెలా తెలిసిందనేవిషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఈ నెల 9వ తేదీన కాందహార్‌లోని ఒమర్‌ ఇంటిపై క్షిపణి దాడులు జరిగాయని, ఆ దాడులకు కొద్ది ముందుగానే ఒమర్‌ అక్కడ్నుంచి తప్పుకున్నారని ఆయనవివరించారు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి లాడెన్‌ కొండల్లోదాక్కుంటున్నాడని తాలిబాన్‌ అధికార వర్గాలు చెప్పాయి.

ఇదిలా వుంటే, అమెరికాను ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలని తాలిబాన్‌ నేత ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ పిలుపునిచ్చారు.పెద్ద యెత్తున సైన్యంలో నియామకాలు జరుగుతున్నాయి. ఇస్లాం మతం కోసం ఆయుధాలను ధరిస్తామని, ప్రాణాలను,ఆస్తులను ఆర్పిస్తామని ముస్లింలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కొత్తగాసైన్యంలో చేరినవారికి శిక్షణ ఇస్తున్నారు.

కాగా, నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు కీలకమైన మజారే షరీఫ్‌ నగరాన్ని చుట్టుముట్టాయి. అమెరికా వైమానిక దాడులను ఆసరా చేసుకుని నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు ముందుకు సాగుతున్నాయి. తాలిబాన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే కూలిపోతుందని నార్తర్న్‌ అలయెన్స్‌ నమ్ముతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+