పొరుగు రాష్ట్రంతో వివాదాల్లేకుండా పరిష్కారం చూపండి: కేంద్రానికి రేవంత్ రెడ్డి వినతి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం అయ్యారు. కీలక ప్రతిపాదనలను అందజేశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ జలవనరుల ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకించి.. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే విషయంపై పొరుగున ఉన్న మహారాష్ట్రతో చర్చలు జరిపాలని, దీనికోసం మధ్యవర్తిత్వం వహించాలని కోరారు.

ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఉన్న ఈ అంతరాష్ట్ర ప్రాజెక్టు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తే, వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది హెక్టార్ల పంటకు సాగునీరు అంతుందని, తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచితే అన్ని రకాలుగా మేలు కలుగుతుందని కేంద్రమంత్రికి స్పష్టం చేశారు.

Revanth Reddy Meets Union Jal Shakti Minister Pushes Tummidihatti Height Increase with Maharashtra

ప్రాణాహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు విషయంలో కొంతకాలంగా మహారాష్ట్రతో వివాదం కొనసాగుతోంది. ముంపు సమస్యల కారణంగా మహారాష్ట్ర దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో గత ప్రభుత్వాల కాలంలో ఈ ప్రాజెక్టు ఎత్తును తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం ఎత్తును పెంచితేనే గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసుకుని, ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడటం సాధ్యమవుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!

ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ సుదీర్ఘ ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇరు పక్షాల ప్రతినిధులు ఒకే వేదికపై కూర్చుని చర్చించుకునేందుకు వీలుగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తగిన సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. కేంద్రం చొరవ చూపితేనే ఈ సంక్లిష్ట సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.

వరల్డ్ కప్ కోసం టీమిండియా లెజెండ్ సెలెక్ట్ చేసిన మెరికలు- వీళ్లే ఉంటే దుమ్ము రేపుతారు
వరల్డ్ కప్ కోసం టీమిండియా లెజెండ్ సెలెక్ట్ చేసిన మెరికలు- వీళ్లే ఉంటే దుమ్ము రేపుతారు

ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇతర పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతుల గురించి కూడా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన సీఆర్ పాటిల్.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి, తదుపరి చర్చలకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+