రెండు జిల్లాల్లో తుపాను బీభత్సం
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల భారీ వర్షాలు కురిసి రెండు జిల్లాలు జలమయమయ్యాయి. సోమవారంఅర్థ రాత్రి నుంచి దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తుఫాను తాకిడికి గురయ్యాయి. చెరువులు ఉప్పొంగుతున్నాయి. చెరువుల కట్టలు తెగిపోతున్నాయి. ఇప్పటి వరకు 12 చెరువుల కట్టలు తెగిపోయాయి. నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఒక్క గూడూరు డివిజన్‌లోనే 500 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వంద కిలోమీటర్ల వేగంతో గాలులువీస్తున్నాయి.
దీంతో చెట్లునేలకొరిగాయి. ఇళ్లు కూలిపోతున్నాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పంటలు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అప్రమత్తమైన సహాయక చర్యలుచేపట్టారు.












Click it and Unblock the Notifications