నాగార్జున 100వ సినిమా సీన్ లీక్.. ఈ రేంజ్ లో విధ్వంసం ఊహించలేదే..!
ఏ హీరోకైనా 100 వ సినిమా చాలా ప్రత్యేకం.. ఆ సినిమా కచ్చితంగా తన అభిమానుల్ని అలరించాలని.. బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ 100 సినిమాలను కంప్లీట్ చేసుకున్నారు. విక్టరీ వెంకటేశ్ దాదాపు 75 సినిమాలకు పైగా నటించారు. ఇక కింగ్ నాగార్జున ప్రస్తుతం 100 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ కెరీర్ లో 100 వ సినిమా చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి ఈ సినిమాపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పకడ్బందీగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. కానీ కింగ్100, అసురుడు అనే టైటిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నాగార్జున 100 వ సినిమాకు తమిళ డైరెక్టర్ ఆర్. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో నితమ్ ఓరు వానమ్ తెలుగులో ఆకాశం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో నాగార్జున సరసన సీనియర్ నటి టబు హీరోయిన్ గా నటిస్తున్నారు. నాగార్జున- టబు హిట్ కాంబినేషన్ అంటారు. గతంలో వీళ్లు నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే దాదాపు 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి స్క్రీన్ పై కలిసి నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దేవి- నాగ్ కాంబోలో ఇదివరకు చాలా మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కానుంది.

ఇక నాగ్ 100 వ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాల మేరకు ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ తరహా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ప్రేక్షకులు కోరుకుంటున్న రియల్ స్టంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే రొమాంటిక్ యాంగిల్ కూడా మిక్స్ చేసి ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాలని చిత్ర యూనిట్ ఆత్రుతగా ఉందట. అయితే తాజాగా నాగ్ 100 వ చిత్రంలోని ఓ ఫైట్ సీన్ లీక్ అయింది. ఆ ఫైట్ సీన్ చాలా అద్భుతంగా ఉంది. నాగార్జున లాంగ్ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications