'త్రిష ఓ పరాన్నజీవి.. దళపతి విజయ్‌ను వాడుకుంటోంది!'
కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్, అగ్ర కథానాయిక త్రిష మధ్య ఉన్న రిలేషన్‌పై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత విడాకులకు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సుచిత్ర ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రిషపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
త్రిష ఓ పరాన్నజీవి.. సుచిత్ర సెన్సేషనల్ కామెంట్స్
సింగర్ సుచిత్ర త్రిషపై తనకున్న అసహనాన్ని ఏమాత్రం దాచుకోకుండా వెల్లడించారు. "నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు. విజయ్ అంటే చాలా ఇష్టం. అందుకే నిష్పక్షపాతంగా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. విజయ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులకు, భార్యకు దూరమై ఒంటరిగా ఉన్నారని, ఇలాంటి సమయంలోనే 'పారాసైట్స్' (పరాన్నజీవులు) లాంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఒంటరితనాన్ని వాడుకుని కొందరు ఆయనకు భారం అవుతున్నారని ఆమె పరోక్షంగా త్రిషను లక్ష్యంగా కామెంట్స్ చేశారు.

విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన
దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో కీలక మైలురాయిని చేరుకుంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి విజయ్ చేరుకున్న ఈ తరుణంలో సుచిత్ర చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. విజయ్ రాజకీయాల్లో రాణించాలంటే కచ్చితంగా తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ మద్దతు తీసుకోవాలని ఆమె సూచించారు. కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఆయన ఒంటరి అయ్యారని.. తండ్రి రాజకీయ మార్గదర్శకత్వం ఉంటేనే విజయ్ మరిన్ని విజయాలు సాధించగలరని ఆమె అభిప్రాయపడ్డారు.
త్రిష రహస్య పోస్టులు.. పెరుగుతున్న సస్పెన్స్
మరోవైపు త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో 'IYKYK' (తెలిసిన వారికి తెలుసు) అనే పదంతో పాటు కొందరు వ్యక్తులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నట్లు ఉండే ఓ కార్టూన్ స్టిక్కర్‌ను ఆమె షేర్ చేశారు. విజయ్ పార్టీ మెజారిటీ సాధించిన సమయంలోనే ఈ పోస్ట్ రావడంతో నెటిజన్లు దీనిని రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. త్రిష ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలపై స్పష్టంగా మాట్లాడకుండా, ఇలాంటి నిగూఢమైన పోస్ట్‌ల ద్వారానే స్పందిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంటారని ఆమె అభిమానులు చెబుతున్నారు.
ముదురుతున్న వివాదం
గత కొద్ది నెలలుగా త్రిష, విజయ్ ఓ వివాహ వేడుకలో కలిసి కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీరిద్దరిపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా, అటు విజయ్ కానీ, ఇటు త్రిష కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఈ లోపే సుచిత్ర చేసిన 'పరాన్నజీవి' కామెంట్స్ కోలీవుడ్‌లో కొత్త చిచ్చు పెట్టాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి రేసులో ఉన్న విజయ్, తన వ్యక్తిగత జీవితంలోని ఈ వివాదాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. త్రిష మాత్రం తనపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో మౌనంగా ఉంటూనే సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తోంది.












Click it and Unblock the Notifications