ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న టాప్-5 హీరోలను వెల్లడించిన ఓర్మాక్స్ మీడియా

ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన 'టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ స్టార్స్' జాబితా ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2026 నాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమను శాసించబోయే శక్తిమంతమైన తారల వివరాలను ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న మన దక్షిణాది హీరోలదే పైచేయి. అందరూ వారే ఉన్నారు. 'పుష్ప: ది రైజ్'తో దేశవ్యాప్తంగా 'పుష్ప రాజ్' మేనరిజమ్‌ను ఒక మ్యానియాలా మార్చేసిన అల్లు అర్జున్, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్-ఇండియా స్టార్. 'పుష్ప 2: ది రూల్' సాధించిన ప్రభంజనం అతడిని అగ్రస్థానంలో నిలబెట్టింది. డ్యాన్స్, యాక్టింగ్, స్టైల్.. ఈ మూడింటి కలయికతో నార్త్ నుంచి సౌత్ వరకు బన్నీకి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ప్రభాస్ అంటే బాక్సాఫీస్ బాహుబలి

భారతీయ సినిమా మార్కెట్ పరిధిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్‌దే. 'బాహుబలి' సిరీస్‌తో మొదలైన ఆయన జైత్రయాత్ర.. 'సలార్', 'కల్కి 2898 AD' వంటి భారీ విజయాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న 'స్పిరిట్', 'ఫౌజీ' వంటి ప్రాజెక్టులతో ప్రభాస్ ఒక గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగారు. బిగ్ బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ మాత్రమే న్యాయం చేయగలడనేది నిర్మాతల భావనగా ఉంది. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే తారక్, గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతున్నారు. 'RRR' సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, డీప్ ఎమోషన్స్ పండించడంలో ఆయన దిట్ట. అందుకే ఓర్మాక్స్ జాబితాలో టాప్ 10 స్టార్లలో ఒకరిగా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

Ormax Media Top 5 actors currently ruling the Indian box office and driving massive collections

యష్ అంటే రాకింగ్ స్టార్‌డమ్

'KGF' సిరీస్‌తో కన్నడ సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టిన యష్, కేవలం రెండు సినిమాలతోనే పాన్-ఇండియా సుల్తాన్‌గా అవతరించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, 'రాఖీ భాయ్' క్యారెక్టరైజేషన్ యువతలో ఒక రేంజ్ క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ప్రస్తుతం 'టాక్సిక్' సినిమాతో పాటు 'రామాయణ'లో రావణుడిగా కనిపించబోతున్న యష్, ఇండియన్ సినిమా భవిష్యత్తును శాసించే స్టార్‌గా నిలిచారు. 'కాంతార' సినిమాతో ఒక ప్రాంతీయ కథను విశ్వవ్యాప్తం చేసిన రిషబ్ శెట్టి, నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. మన సంస్కృతిని, మట్టి వాసనను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన చూపిన ప్రతిభకు దేశం ఫిదా అయ్యింది. జై హనుమాన్ వంటి భారీ ప్రాజెక్టులతో రిషబ్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+