IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసులోకి మరో టీమ్..! బెర్త్ సాధ్యమేనా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్లే ఆఫ్ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే ఆగ్రస్దానాల్లో నిలిచిన జట్లు సైతం ఓటమి పాలవుతుండటం, కొత్త జట్లు టాప్ 4 జాబితాలోకి వస్తుండటం, మిగిలిన మ్యాచ్ లలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ మధ్య ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠ భరితంగా మారింది. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) సాధించిన నాలుగు వరుస విజయాలు ఆ జట్టును ప్లే-ఆఫ్స్ ఆశలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితి ఏంటో ఓసారి చూద్దాం..
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై కేకేఆర్ సాధించిన ఎనిమిది వికెట్ల ఘన విజయం కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్లను 9కి చేర్చింది. ఈ విజయంతో KKR ఈ సీజన్‌లో నాలుగో గెలుపును నమోదు చేసుకుంది. సీజన్ ఆరంభంలో కొంత తడబడినా ప్రస్తుతం తమ చివరి నాలుగు మ్యాచ్‌లలో కేకేఆర్ ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది. ఐపీఎల్ లీగ్ దశ ముగియడానికి ముందు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నందున, పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న కేకేఆర్ కు ప్లే-ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

అయితే కేకేఆర్ ప్లేఆఫ్ కు చేరాలంటే ఏం చేయాలన్న ప్రశ్నకు మిగిలిన నాలుగు మ్యాచ్ లు గెలవడమే అసలైన సమాధానం. అయితే సాధారణంగా 16 పాయింట్లు ప్లే-ఆఫ్స్‌కు సరిపోతాయి. కానీ పంజాబ్ కింగ్స్ (PBKS)తో రద్దయిన మ్యాచ్ కారణంగా కేకేఆర్ కు అదనపు పాయింట్ రావడంతో వారి పాయింట్లు 17కు చేరే అవకాశం ఉంటుంది. ఇందుకోసం నైట్‌రైడర్స్ మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. 17 పాయింట్లు సాధిస్తే నెట్ రన్ రేట్ క్లిష్టమైన లెక్కలు లేకుండానే దాదాపు టాప్-4లో స్థానం ఖాయం చేస్తుంది. కేకేఆర్ తమ తదుపరి నాలుగు మ్యాచ్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ను ఎదుర్కోవాల్సి ఉంది. కేకేఆర్ ఈ మ్యాచ్‌లలో ఒకటి ఓడినా పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. ఒక ఓటమి వారి గరిష్ట పాయింట్లను 15కి తగ్గిస్తుంది. అప్పుడు ఇతర జట్లతో సమానం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్లీ నెట్ రన్ రేట్ కీలకం. ముఖ్యంగా ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లలో ఫలితాలు కేకేఆర్ వైపు ఉంటే ప్లేఆఫ్ బెర్త్ దక్కినట్లే.












Click it and Unblock the Notifications