నాదెండ్లలో కాంగ్రెస్ నేత దారుణహత్య
గుంటూరుః గుంటూరు జిల్లా నాదెండ్లలో శనివారం మధ్యాహ్నం పాతకక్షలు పడగవిప్పాయి. నాదెండ్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు వెంకటరెడ్డిని ప్రత్యర్థులు కొడవళ్ళతో నరికి చంపారు. దారికాచిన ప్రత్యర్థులు వెంకట రెడ్డిపై వేటకొడవళ్లతో ఒక్కపెట్టున దాడి చేసి దారుణంగా నరికి చంపారు.
ఈ సంఘటనతో నాదెండ్ల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ఉన్నతాధికారులు హుటాహుటిన గుంటూరు నుంచి నాదెండ్లకుతరలి వెళ్ళారు.












Click it and Unblock the Notifications
