22న లక్ష్మణ్ దక్షిణాఫ్రికాపయనం
ముంబాయి: దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు వన్డేసీరిస్లో పాల్గొంటున్న భారత జట్టులోకి మిడిలార్డర్ బ్యాట్స్మన్గావి.వి.ఎస్ లక్ష్మణ్‌ను త్వరలో తీసుకోనున్నారు. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా ఎటువంటి సమస్యలు లేని లక్ష్మణ్‌ను ఈనెల 22వ తేదీన దక్షిణాఫ్రికాకు పంపుతున్నట్టు భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి నిరంజన్ షా చెప్పారు.
కాగా, జహీర్‌ఖాన్, ఆశిష్ నెహ్రా, శటగోపన్ రమేష్, హేమాంగ్ బదానీలకు ఈనెల 23వ తేదీన ఫిట్నెస్ పరీక్షలు జరుపనున్నారు. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా బుధవారం నాడు జరిగిన మ్యాచ్‌లో కెన్యా చేతిలో అనూహ్యంగా భారత్ ఖంగు తినటంతో లక్ష్మణ్‌ను వెంటనే పంపవలసిందిగా భారత జట్టు మేనేజ్మెంట్కువిజ్ఞప్తి చేసిందని షా చెప్పారు. టెస్ట్ జట్టులోకి లక్ష్మణ్ ఎంపిక ఇప్పటికే పూర్తయి నందున అతన్ని 22న పంపుతున్నామని, వన్ డేసీరిస్లో తక్కిన్ మాచ్‌లలో లక్ష్మణ్ ఆడుతాడని షా తెలిపారు.












Click it and Unblock the Notifications
