కల్పవృక్షంపై శ్రీనివాసుడు
తిరుమలః బ్రహ్మోత్సవాలలో భాగంగా కలియుగ వైకుంఠ నాధును శ్రీనివాసుడు శనివారం ఉదయం కల్పవృక్ష వాహనంపైఊరేగారు. బ్రహ్మోత్సవాల నాలుగో రోజైన శనివారం నాడు మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో వైభవంగాఊరేగారు. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీనాధుడుస్వర్ణమయ కల్పవృక్షంపై కన్నుల పండువగాఊరేగారు.
గజ, తురగాలతో పాటు బ్రహ్మరధం ముందు నడుస్తుండగా భక్త జనుల భజనలు, కోలాటాలు, వేదాధ్యయనాల మధ్య శ్రీ వేంకటేశ్వరుడు తిరుమల వీధుల్లోఊరేగారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
