Hyderabad: హైదరాబాద్‌ లో నెం.1 రిచెస్ట్ ప్రాంతం ఇదే.. ఇక్కడ ఇల్లు కొనాలంటే..!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు గణనీయమైన చరిత్ర ఉంది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ప్రఖ్యాత నగరంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ మహానగరానికి 1591 లో బీజం పడింది. చార్మినార్ వేదికగా అభివృద్ధి విస్తరిస్తూ వచ్చింది. ఓ వైపు చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుంటూ హైదరాబాద్ భారత్ లోనే అత్యంత ప్రాధాన్యమైన నగరాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక భాగ్యనగరంలో అంతర్జాతీయ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, మెటాలు ఉన్నాయి. అలాగే ఫార్మాస్యుటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ విభాగాల్లోనూ గణనీయమైన ప్రగతిని సాధించింది. ఇవే కాక పలు అంతర్జాతీయ సంస్థలు ఈ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఇక హైదరాబాద్ లో ప్రస్తుత జనాభా కోటీ 45 లక్షల వరకు ఉంటుందని అంచనా.. ఈ జనాభా నిత్యం పెరుగుతూనే ఉంది. ఉపాధి, ఉద్యోగం, విద్య, పని అని ఇలా రకరకాల కారణాలతో హైదరాబాద్ కు నిత్యం లక్షల మంది వస్తుంటారు. ఏపీ నుంచే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో జీవనం సాగిస్తుంటారు. అయితే భాగ్యనగరంలో ఒక్క ఇళ్లు కట్టుకోవాలి అనేది కలగా ఉంటుంది. కానీ ఇక్కడున్న ధరలకు సామాన్య ప్రజలకు అది అందని ద్రాక్ష మాదిరిగానే ఉండిపోతుంది. మరోవైపు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే సంపన్నులు కూడా ఇళ్లు, ప్లాట్ కొనలేని విధంగా రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక హైదరాబాద్ లో రిచెస్ట్ ఏరియా ఏది..? అంటే జూబ్లీహిల్స్ , బంజారా హిల్స్ అనే చెప్పాలి. జూబ్లీహిల్స్ లో ముఖ్యంగా ప్రముఖ సినీ తారల దగ్గర్నుంచి బిజినెస్ టైకూన్ల వరకూ నివసించే అల్ట్రా లగ్జరీ విల్లాలు, ఇండిపెండెంట్ హౌజ్ లు కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి అపార్ట్ మెంట్స్ లో అడుగు ధర సుమారు రూ. 13,200 నుంచి ప్రారంభమై రూ. 23 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ప్రీమియమ్ ప్లాట్స్ లేదా స్థలాల ధర చదరపు గజానికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అటు బంజారా హిల్స్ లోనూ అపార్ట్‌ మెంట్ ధరలు ఒక్క చదరపు అడుగుకు సుమారు రూ.9,200 నుంచి రూ.15,900 వరకు ఉంది. అలాగే స్థలం ధర చూస్తే ఒక్క చదరపు గజానికి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Hyderabad the most expensive areas buying a house here remains a challenge Most Expensive Areas hyd

మరోవైపు ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇక్కడి హైరైజ్ లగ్జరీ అపార్ట్ మెంట్స్, హెచ్ఎండీఏ భూమి వేలాలు ఈ ప్రాంతం గణనీయంగా డెవలప్ కావడంలో దోహదపడ్డాయి. ఈ ప్రాంతాల్లో భూమి ధర చదరపు గజం సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇక ఐటీ ఉద్యోగులకు నెలవుగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+