Viral Video: వందే భారత్ రైలులో అద్భుతం.. 180 కి. మీ. వేగంతో వెళ్లినా గ్లాసులో నీటి చుక్క కూడా కింద పడలేదు..

మనదేశంలో అత్యధిక మంది రైలులోనే ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు రైలు సేవలను విరివిగా ఉపయోగించుకుంటారు. తక్కువ టికెట్ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అనువుగా భారతీయ రైల్వేలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18 జోన్లు అలాగే 71 ఆపరేటింగ్ డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ఇక ప్రయాణికుల సౌకర్యానికి తగ్గట్లుగా ఇండియన్ రైల్వేస్ నిత్యం అధునాతన సాంకేతికతను అలవరుచుకుని ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేస్ లో వందేభారత్ రైలు సేవలు గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సెమీ- హై స్పీడ్ ఎలక్ట్రిక్ రైలును తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15 న ప్రధాని మోదీ ప్రారంభించారు.

VandeBharattrain while traveling at a speed of 180 km h not single drop of water spilled from glass

ఈ వందేభారత్ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం బిజినెస్ పరంగా ఈ రైళ్లు గంటకు 130 కి. మీ. వేగంతో ప్రయాణం చేస్తున్నాయి. ఈ రైలు బోగీలు, ఇంజిన్ ను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది. ఇక ఇవి పూర్తిగా ఏసీ కోచ్ లు.. అలాగే ఆటోమెటిక్ డోర్లు ఉంటాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థతోపాటు అధునాతన సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. అందుకే భద్రత, వేగవంతమైన ప్రయాణం, సౌకర్యం దృష్ట్యా చాలామంది ఈ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఇప్పటికే వందే భారత్ రైళ్లపై స్పీడ్ టెస్టును నిర్వహించిన సంగతి తెలిసిందే. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లి విజయవంతంగా పరీక్షను ముగించింది. అలాగే వాటర్ టెస్టును కూడా పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వందేభారత్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో రైలులోని ఓ టేబుల్ పై నీటితో నిండిన మూడు గ్లాస్ లను ఏర్పాటు చేశారు. అయితే రైలు అంత స్పీడ్ గా వెళ్తున్నప్పటికీ గ్లాసులోంచి ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఉండటం అద్భుతం అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+