టీమిండియా స్పిన్నర్ విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు!

Ranji Trophy 2026: రంజీ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దుబే సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజే హర్ష్ దుబే తన తిరుగులేని స్పిన్ ధాటితో ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. 23.1 ఓవర్లలో కేవలం 53 పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్ష్ దుబే నిలిచాడు.

IPL 2027: ఐపీఎల్ మినీ వేలానికి ముందు బీసీసీఐ సడెన్ ట్విస్ట్!
IPL 2027: ఐపీఎల్ మినీ వేలానికి ముందు బీసీసీఐ సడెన్ ట్విస్ట్!

209 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మధ్యప్రదేశ్ జట్టుకు విదర్భ లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దుబే చుక్కలు చూపించాడు. హర్ష్ దుబే మ్యాజిక్ స్పిన్ ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 66.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో అథర్వ మహాజన్ ఒక్కడే 123 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసి పోరాట పటిమను కనబరిచాడు. సారాంశ్ జైన్ 34 పరుగులు, ఆవేశ్ ఖాన్ నాటౌట్‌గా 13 పరుగులు చేశారు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లను హర్ష్ దుబే ఒక్కడే తీసుకోగా.. మిగిలిన ఒక్క వికెట్‌ను నచికేత భూటే దక్కించుకున్నాడు.

Ranji Trophy 2026 Harsh Dubey Creates History with Stunning 9-Wicket Haul Against Madhya Pradesh

తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు కూడా తప్పని కష్టాలు
మధ్యప్రదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసినప్పటికీ.. విదర్భ కూడా తమ తొలి ఇన్నింగ్స్ లో ఆరంభంలోనే తడబడింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారంగా విదర్భ ఇంకా 153 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కెప్టెన్ అక్షయ్ వాడ్కర్(9 పరుగులు), ధ్రువ్ షోరే(21 పరుగులు) ఉన్నారు.

ముంబై ఇండియన్స్ లో భారీ ప్రక్షాళన..! మలింగ సహా ముగ్గురు అవుట్..!
ముంబై ఇండియన్స్ లో భారీ ప్రక్షాళన..! మలింగ సహా ముగ్గురు అవుట్..!

రెండో రోజు ఆటపై తీవ్ర ఉత్కంఠ
మధ్యప్రదేశ్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 8 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి విదర్భను దెబ్బతీయగా.. పేసర్ ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు. తొలి రోజు మ్యాచ్ ఇరు జట్ల స్పిన్నర్ల ఆధిపత్యంతో ముగిసింది. రెండో రోజు ఆటలో మధ్యప్రదేశ్ ఆధిక్యాన్ని తగ్గించి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించాలని విదర్భ భావిస్తుండగా.. త్వరగా విదర్భను ఆలౌట్ చేయాలని మధ్యప్రదేశ్ ప్రణాళికలు రచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+