ఆఫ్ఘన్‌ ఇళ్ళపై బాంబులు-10మంది మృతి

కాబూల్‌ః ఆగ్నేయ కాబూల్‌ లో అమెరికా యుద్ధవిమానాలు ఆదివారం నాడు బాంబుల వర్షం కురిపించాయి. ఈ బాంబుల్లో కొన్ని జనావాసాలపై పడడంతో కనీసం పది మంది దుర్మరణం పాలయ్యారు.

ఆగ్నేయ కాబూల్‌ లోని ఓ రెండతస్తుల భవనంపై ఆదివారం నాడు బాంబులు పడ్డాయి. దీనితో భవనంలో నివసిస్తున్నఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పురుషులు మరణించారు. ఈ భవనానికి పక్కనే వున్న మరో ఇల్లు కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఇళ్ళకు ఆఫ్ఘన్‌సైనిక స్థావరం కనీసం ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో వున్నది. ఎ.ఎఫ్‌.పి. రిపోర్టర్‌ ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

అమెరికా దాడులు సృష్టిస్తున్న మారణ కాండకు ఈ దాడే నిదర్శనం అని స్థానికులు వాపోయారు. మహిళలు, చిన్నారులు ఏ చేశారని ఇలా చంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+