తీవ్రవాదానికి పాతరః చంద్రబాబు

హైదరాబాద్‌ః తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహాపెకలించేందుకు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధంగా వుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పోలీస్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌, డి.జి.పి. దొర తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో హింసకు, తీవ్రవాదానికి తావు లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది వివిధ తీవ్రవాద, నక్సలైట్ల దాడుల్లో మరణించిన 134 మంది పోలీసులకు ముఖ్యమంత్రి నివాళులుఅర్పించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్‌ శాఖను ఆధునీకరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా హోం మంత్రి దేవేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ తీవ్రవాదం సృష్టించే హింసాకాండను ఎదుర్కొనేందుకు పోలీసులు ఎల్లవేళలా సన్నద్ధంగా వుండాలనికోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+