కాంగ్రెస్, బిజెపిలపై కెసిఆర్ ధ్వజం
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ఎటూ తేల్చకోక పోవడాన్ని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్య చేశారు.
నాలుగేళ్ల వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తేవద్దని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తి రాష్ట్ర నేతలకు చెప్పడాన్ని ఆయన తీవ్రంగావిమర్శించారు. కాంగ్రెస్, బిజెపిలు తమ తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజలతోఆటలాడుకుంటున్నాయని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications