కార్గిల్ తరహా యుద్ధానికి పాక్ సన్నాహం
న్యూఢిల్లీః భారత సరిహద్దులో పాకిస్తాన్‌పెద్ద ఎత్తున సేనలను మొహరిస్తున్నది.సైనికదళాలకు చెందిన ఉన్నతస్థాయి వర్గాలు ఈవిషయాన్ని వెల్లడించాయి. జమ్ముకాశ్మీర్ లోని అక్నూర్ డివిజన్ తో పాటు రాజస్థాన్ లోని గంగానగర్ సరిహద్దుకు అవతల పాక్ వందల సంఖ్యలోసైనికుల్ని రంగంలోకి దించినట్లు సమాచారం అందింది. ఈ రెండు ప్రాంతాలలో గత వారం రోజులుగాసైనికుల కదలికలు తీవ్రం అయ్యాయని తెలిసింది.
ఆఫ్ఘన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇస్తున్న ముషారఫ్ పై పాకిస్తాన్ లో నిరనస పెల్లుబుకుతున్నది. ఈ వ్యవహారం నుంచి పాకిస్తానీయుల దృష్టి మళ్ళించేందుకు పాకిస్తాన్ కార్గిల్ తరహా యుద్ధాన్ని చేయవచ్చుననిసైనిక వర్గాలు అంటున్నాయి. పాక్ సైన్యం దాదాపు హై అలర్ట్ ప్రకటించిసైనికులకు చివరకు సెలవలు కూడా రద్దు చేసినట్లు సమాచారం. గతంలో నవంబర్, డిసెంబర్ లలోనే కార్గిల్ సమరం జరిగినవిషయం విదితమే.












Click it and Unblock the Notifications