తొడగొట్టి సవాలువిసిరిన తాలిబన్లు
కాబూల్‌ః అమెరికా తన టెక్నాలజీని ఉపయోగించి ఆకాశం నుంచి అగ్నివర్షం కురిపిస్తూ తాలిబన్ సర్కార్‌ను కుప్పకూల్చాలని కలలుకంటున్నదని తాలిబన్ నేత, అఎn్గాన్ విదేశాంగ మంత్రి ముత్తా వకీల్ దుయ్యబట్టారు. తాలిబన్లలో విభేదాలు వున్నట్టుగా జరుగుతున్న ప్రచారం కూడా అమెరికా కుట్రనేనని ఆయన అన్నారు.
దమ్ము, ధైర్యం, తెగువ, తెంపరితనం వుంటే జార్జ్‌బుష్, టోని బ్లెయిర్ చెరో ఎకె 47 తీసుకుని బరిలోకి దిగితే ముల్లా ఒమర్ సత్తా ఏమిటో తెలుస్తుందని కాందహార్‌లో ఏర్పాటు చేసిన విదేశీవిలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. భద్రతాకారణంగా దృష్ట్యా మాత్రమే ముల్లా ఒమర్ ఒక చోట వుండటం లేదని ఆయన చెప్పారు. విచ్చలవిడిగా బాంబులు గుప్పిస్తూ అమెరికన్‌సేనలు అమాయక ప్రజల ప్రాణాలను కబళిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications