చేతగాని సిఎం తప్పుకోవడం మేలు
హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని రాజకీయం చేస్తున్నారని టిఆర్‌ఎస్ నేత చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ సమ్మెపై ముఖ్యమంత్రి అసత్య ప్రచారానికి దిగడాన్ని, ఆర్టీసీ సిబ్బందికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సమ్మె పరిష్కారంవిషయంలో ముఖ్యమంత్రి తాన నిస్సహాయతను ప్రకటించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సమస్యల పరిష్కారం కోసమే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారని చంద్రశేఖర్‌రావుపేర్కొన్నారు. చేతగాకపోతే పదవిలోంచి చంద్రబాబు తప్పుకోవడం మేలని సలహా ఇచ్చారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆయన ఆరోపించారు. కుక్కను చంపడానికి పిచ్చికుక్క అని ముద్రవేసినట్టుగా ఆర్టీసీని నష్టాజాతక సంస్థగా ముద్రవేసి ప్రైవేట్ పార్టీలకుఅప్పగించే ప్రయత్నంలో వున్నారని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications