'రోబోట్ పోలీస్' రిటైర్డ్ : జీతం రూ. 63 లక్షలు.. అరెస్టులు మాత్రం సున్నా!

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో రోబో పోలీస్ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. డబ్లిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉపయోగించిన “డబ్‌బాట్” అనే రోబోను ఏడాది కూడా పూర్తికాకముందే విధుల నుంచి తప్పించారు. సుమారు రూ.63 లక్షల ఖర్చుతో తీసుకొచ్చిన ఈ యంత్రం ఒక్క అరెస్ట్‌కు, ఒక్క టికెట్‌కు, కనీసం పోలీసుల జోక్యం అవసరమైన ఘటనకు కూడా దారితీయలేదు.

కె5 ఆటోనమస్ సెక్యూరిటీ రోబోగా పిలిచే ఈ యంత్రాన్ని కాలిఫోర్నియాకు చెందిన నైట్‌స్కోప్ సంస్థ తయారు చేసింది. 2025 జులైలో డబ్లిన్ నగరంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఐదు అడుగులకు పైగా ఎత్తు, దాదాపు 180 కిలోల బరువు ఉన్న ఈ రోబో చక్రాలపై కదులుతూ 360 డిగ్రీల కెమెరాలతో పరిసరాలను గమనించేలా రూపొందించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు ఉపయోగించే కాల్ బటన్ కూడా ఇందులో ఉంది.

robot-police-retired-us-police-withdraw-expensive-crime-fighting-robot-after-a-failed-trial

రోబో పోలీస్ ప్రయోగం ఎందుకు విఫలమైంది?

డబ్‌బాట్‌కు ఇచ్చిన ప్రధాన బాధ్యత ఒక పార్కింగ్ గ్యారేజ్‌ను పర్యవేక్షించడం. అనుమానాస్పద కదలికలు లేదా పోలీసులకు తెలియజేయాల్సిన పరిస్థితులు కనిపిస్తే సమాచారం అందించాలన్నదే లక్ష్యం. కానీ నెలల తరబడి విధుల్లో ఉన్నప్పటికీ, అది గుర్తించిన కీలక ఘటన ఏదీ నమోదుకాలేదు. నగర అవసరాలకు ఇది సరిపోవడం లేదని అధికారులు భావించి ప్రయోగాన్ని నిలిపేశారు.

ఈ నిర్ణయంతో పెద్ద ఖర్చు ప్రణాళిక కూడా ఆగిపోయింది. రెండు రోబోలను రెండేళ్లపాటు వినియోగించేలా 2.38 లక్షల డాలర్లకు పైగా విలువైన ఒప్పందాన్ని డబ్లిన్ మొదట పరిశీలించింది. రెండో రోబోను చివరకు ప్రవేశపెట్టలేదు. ప్రాజెక్టుపై పోలీస్ విభాగం 1.28 లక్షల డాలర్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ, కంపెనీ నుంచి కొంత రీయింబర్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఏఐ రోబోలపై పెరుగుతున్న చర్చ

నైట్‌స్కోప్ రోబోలపై సందేహాలు రావడం ఇదే మొదటిసారి కాదు. న్యూయార్క్ సబ్‌వేలో 2023లో ప్రవేశపెట్టిన కె5 రోబోలు కూడా ఉపయోగం, పర్యవేక్షణ అవసరం వంటి కారణాలతో తర్వాత వెనక్కి వెళ్లాయి. సాన్ ఆంటోనియో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉపయోగించిన మరో రోబోకు నావిగేషన్, ప్రత్యక్ష వీడియో-ఆడియో ఫీడ్‌లలో సమస్యలు వచ్చినట్లు నివేదికలు తెలిపాయి.

ఒకవైపు అమెరికాలో ఇలాంటి ప్రయోగాల ఫలితాలపై ప్రశ్నలు వస్తుండగా, చైనా వంటి దేశాలు ప్రజా ప్రదేశాల్లో ఏఐ ఆధారిత రోబోల వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. ట్రాఫిక్ నిర్వహణ, పర్యాటకులకు మార్గనిర్దేశం, పరిశ్రమల్లో ప్రమాదకర పనులు, శుభ్రత సేవల్లో సహాయం వంటి రంగాల్లో రోబోలను పరీక్షిస్తున్నాయి. డబ్‌బాట్ ఉదంతం మాత్రం సాంకేతికతతో పాటు ఖర్చు, ప్రయోజనం, నమ్మకాన్ని కూడా సమానంగా కొలవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+