ప్రకాష్ రాజ్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్.. అరెస్ట్ ముప్పు!

దక్షిణాది సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని నాలుగు వేర్వేరు ఓటరు జాబితాలలో ప్రకాష్ రాజ్ పేరు ఉందనే ఆరోపణలపై బెంగళూరు కోర్టు ఆయనకు తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రకాష్ రాజ్‌పై ఇలా వారెంట్ జారీ కావడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయనపై ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే ముప్పు పొంచి ఉందని న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.

అసలేమిటీ వివాదం?
బెంగళూరుకు చెందిన లాయర్ కె.దిలీప్ కుమార్ 2023లో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు విచారణ సాగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. పిటిషనర్ ఆరోపణల ప్రకారం.. బెంగళూరులోని శాంతినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు కావడంతో పాటు చెన్నై(తమిళనాడు)లోని వేలచ్చేరి నియోజకవర్గంలో, తెలంగాణలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరో రెండు చోట్ల(మొత్తం నాలుగు చోట్ల) ప్రకాష్ రాజ్ పేరు ఓటరు జాబితాలో ఉంది. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దేశంలో ఏ పౌరుడికైనా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే తాను కేవలం తమిళనాడులోనే ఓటు హక్కును వినియోగించుకుంటానని.. మిగిలిన చోట్ల తన పేరు ఉండటంపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని ప్రకాష్ రాజ్ గతంలో పేర్కొన్నారు.

Prakash Raj Faces Arrest Threat Bengaluru Court Issues Third Non-Bailable Warrant Full Details

కోర్టుకు హాజరుకాకపోవడంతో వరుస వారెంట్లు
ఈ కేసులో ప్రకాష్ రాజ్‌కు కోర్టు సమన్లు పంపినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పోలీస్ కమిషనర్ ద్వారా సమన్లు జారీ చేసినా.. పిటిషన్లో పేర్కొన్న చిరునామాలో నటుడు అందుబాటులో లేరు. ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్లినట్లు నివేదిక రావడంతో కోర్టు మార్చి 17న మొదటి నాన్-బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 17న విచారణకు కూడా ఆయన హాజరు కాకపోవడంతో రెండోసారి వారెంట్ ఇచ్చారు. తాజాగా జూన్ 12న కోర్టు మూడోసారి వారెంట్‌ను జారీ చేస్తూ.. తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది.

తిరుపతి కోర్టులోనూ క్రిమినల్ కేసు
ఓటరు జాబితా వివాదమే కాకుండా ప్రకాష్ రాజ్‌కు మరో కొత్త చట్టపరమైన సమస్య వచ్చి పడింది. హిందూ దేవతలు, రామాయణంపై ఆయన బహిరంగ వేదికలపై చేసిన కొన్ని కామెంట్స్ తమ మతపరమైన భావాలను గాయపరిచాయంటూ బీజేపీ నేత, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి తిరుపతి కోర్టులో ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఓ వైపు వరుస కోర్టు కేసులు, మరోవైపు చేతినిండా సినిమాలతో (హిందీలో 'దృశ్యం 3', తెలుగులో 'వారణాసి', 'స్పిరిట్', తమిళంలో 'జన నాయగన్') బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్ ఈ వివాదాల నుండి ఎలా బయటపడతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+