వాషింగ్టన్‌ః అల్ జహీరా టెలిజన్ లో అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ చేసిన ప్రసంగాన్ని సంధిప్రేలాపనగా అమెరికా కొట్టిపారేసింది. లాడెన్ వ్యాఖ్యలు అతని నిస్సహాయ పరిస్థితికి అద్దం పడుతున్నాయనిపెంటగాన్ వర్గాలు శ్లేషించాయి. ఐక్యరాజ్య సుతి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ ను మర్శించి లాడెన్‌పెద్ద తప్పు చేశాడని అమెరికా వ్యాఖ్యానించింది.
ఉగ్రవాదంపై అమెరికా చేస్తున్న పోరాటాన్ని మత యుద్ధంగా లాడెన్ దుష్ప్రచారం చేస్తున్నాడనిపెంటగాన్ వర్గాలు మర్శించాయి. కోఫి అన్నన్ ను మర్శించడం వల్ల లాడెన్ మరింత మందికి దూరం అవుతున్నాడని అమెరికా వ్యాఖ్యానించింది. మరిన్ని దాడులు తప్పవంటూ లాడెన్ చేసిన హెచ్చరికలపై అమెరికా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.












Click it and Unblock the Notifications
