వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నెల్లూరుకు మళ్ళీ జలగండం
హైదరాబాద్‌ః బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం మరింత బలపడింది. ఫలితంగా కోస్తా జిల్లాలలో మంగళవారం
రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు మళ్ళీ వరద ముప్పు ఏర్పడే ప్రమాదం వున్నదని అధికారులు హెచ్చరించారు. కావలిలో మంగళవారం 11 సెంటీdుటర్ల వర్షపాతం నమోదు కాగా బుధవారం 20 సెంటీdుటర్ల వర్షం పడింది. గూడూరు, నెల్లూరులలో 11 సెంటీ dుటర్ల వర్షపాతం నమోదైంది.కోస్తా తీరం అంతటా భారీ వర్షాలు కురిస్తున్నాయి. రానున్న 48 గంటల పాటు పరిస్థితి ఇదే ధంగా వుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.