సమ్మె చాలించిన ఆర్టీసీ
హైదరాబాద్‌ః పాతిక రోజులుగా నిరవధికంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు బుధవారం అర్ధరాత్రి తెరపడింది. ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య అవగాహన కుదరడంతో సమ్మె రుస్తున్నట్టుగా సమ్మెకు నాయకత్వం వహించిన ఐక్యకార్యాచరణ సుతి ప్రకటించింది.
మొత్తం 68 డిమాండ్లతో కార్మికులు సమ్మె ప్రారంభించగాఅందులో 42 పరిష్కారమయ్యాయి. 16 డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించింది. పదింటిపై తర్వాత పరిశీలన జరుపుతామని హాdు ఇచ్చింది. 125 కోట్ల రూపాయల మేర జీతభత్యాలను పెంచడానికి ప్రభుత్వంఅంగీకరించింది. సగటును 400 నుంచి 1600 రూపాయలమేర జీతాలుపెరుగుతాయి. ఏప్రిల్ నుంచే ఈ పెరుగుదల అమల్లోకి వస్తుంది. సమ్మెకాలానికి జీతాలు వుండవు. అయితే అడ్వాన్స్‌గా కొంతమొత్తాన్ని ఉద్యోగులకు చెల్లిస్తారు.
ఆర్టీసీ బస్సులపై మోటార్ వెహికిల్ టాక్స్‌ను గ్రాdుణ ప్రాంతాల్లో 12.5శాతం, పట్టణ ప్రాంతాల్లో 10 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వంఅంగీకరించింది. ధ వర్గాలకు ఇచ్చే రాయితీల్లో ప్రభుత్వం 50 శాతం భారంఅంటే సుమారు 100 కోట్ల రూపాయలు భరిస్తుంది. అక్రమ వాహనాల నిరోధానికి ప్రత్యేక కుటీని ఏర్పాటు చేస్తారు. ఒప్పందానికి లోబడి సమ్మె రుస్తున్నప్పటికీ తమకు ఇంకా కొన్ని అభ్యంతరాలు వున్నాయని జెఎసిలోఒకటైన స్టార్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పేర్కొంది. బుధవారం సాయంత్రం ఆయిదు గంటలకు ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి వరకుసాగాయి. గురువారం నాడు ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు మద్దతుగా ప్రతిపక్షాలు రాష్ట్రబంద్ తలపెట్టడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకున్నది. సమ్మె రుస్తున్న కారణంగా గురువారం నాడు రాష్ట్ర బంద్‌ను కూడా రుంచారు.












Click it and Unblock the Notifications
