చైనా బయలుదేరి వెళ్లిన జిన్‌పింగ్- కుదరని ఏకాభిప్రాయం?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటనను ముగిసింది. కొద్దిసేపటి కిందటే ఆయన ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర దేశాధినేతలతో కలిసి దౌత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా సభ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి.
బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన పర్యటన ముగియడంతో చైనాకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు జిన్‌పింగ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న దౌత్య సమీకరణాల నేపథ్యంలో ఆయన చేపట్టిన భారత్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత లభించింది. అందరి చూపూ దీని మీదే నిలిచింది.

సభ్య దేశాల సమన్వయంతో పాటు అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం కోసం జరిగిన వివిధ ఉన్నత స్థాయి సమావేశాలలో జిన్ పింగ్ చురుగ్గా వ్యవహరించారు. కొంతకాలంగా భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు బద్ధ శత్రుత్వాన్ని తలపిస్తున్న క్రమంలో ఈ సదస్సు కోసం జిన్‌పింగ్ ఏడేళ్ల తర్వాత రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఆయన దౌత్య ప్రయాణం ముగిసినప్పటికీ, సదస్సులో తీసుకున్న నిర్ణయాల తాలూకు ప్రభావం రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపించే అవకాశాలు లేకపోలేదు.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరిస్తూనే ద్వైపాక్షిక సంబంధాలను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భారత్ ప్రతిపాదించింది. సరిహద్దుల్లో యధాతథ స్థిని కొనసాగిస్తూనే రెండు దేశాలు సమానంగా అభివృద్ధి సాధించాలని చైనా కోరుకుంది. పరస్పర గౌరవం, సరైన అవగాహనతో కూడిన రాజకీయ అజెండాతో విభేదాలను తొలగించుకోవాలని, సరిహద్దుల వద్ద తలెత్తిన వివాదాల చిక్కుముడిని విడదీయడం కంటే మిగిలిన రంగాల్లో పురోగమనం సాధించాలనేది చైనా ప్రతిపాదన.
దీనికి భిన్నంగా భారత్.. తన వైఖరిని తేల్చిచెప్పింది. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొనడం అనేది ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి అత్యంత కీలకమైన పునాది అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాలను పరస్పరం గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. సరిహద్దు సమస్య పరిష్కారం ఇరు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు.
#WATCH | Delhi: Chinese President Xi Jinping departs from Delhi after participating in the BRICS Summit 2026. pic.twitter.com/aO8IME4sum
— ANI (@ANI) September 13, 2026














Click it and Unblock the Notifications
