హైదరాబాద్‌ః ఆర్ధిక సంస్కరణలు పేద ప్రజల బాగుకోసమే తప్ప వారి జీతాలను మరింత దుర్భరం చేసేందుకు కాదని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. ఎన్‌టిఆర్ భవన్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన నియోజకవర్గం స్తాయి కార్యకర్తల శిక్షణా శిబిరం రెండో రోజు శనివారం నాడు కార్యకర్తలను ఉద్దేశించి పలువురు నేతలు ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,పేదల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుందని అవసరాన్ని బట్టి కొత్త పథకాలను అమలుచేస్తుందని వారు చెప్పారు.స్వయంసహాయక బృందాల గురించి, డ్వాక్రా మహిళల గురించి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధ ప్రథకాల గురించి కార్యకర్తలకు వరించారు. సంస్కరణలుసంక్షేమానికి వ్యతిరేకమనే ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని నేతలు ఉద్బోధించారు.












Click it and Unblock the Notifications