ఐక్యరాజ్యసుతిః ఐక్యరాజ్య సుతి వేదిక నుంచి భారత్ మరోసారి పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో రుచుకుపడింది. పాకిస్తాన్ పేరు ప్రత్యక్షంగా ఎత్తకుండా, టెర్రరిజం ఏ ముసుగులో సాగినా దానిని తుదముట్టించాలని ప్రధాని వాజ్‌పేయి ఐక్యరాజ్య సుతి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.
కొన్ని దేశాలు టెర్రరిస్టులకు ఆశ్రయాన్నిస్తున్నాయని, టెర్రరిజాన్ని ప్రొత్సహిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.టెర్రరిజానికి రాజకీయంగా, మతపరంగా సైద్ధాంతికంగా ఎటువంటి సమర్థింపు వుండరాదని ఆయన అన్నారు. అన్నిదేశాలు సమన్వయంగా వ్యవహరించి ఇటువంటి ధోరణులకు కళ్లెం వేయాలని ఆయనకోరారు.
కొన్ని దేశాలు ఒక దేశంలో టెర్రరిజాన్ని ప్రొత్సహిస్తూ మరో దేశంలో టెర్రరిజాన్ని ఖండిస్తున్నాయని ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలను సహించరాదని పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన మర్శించారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై గళం ప్పిన ప్రధాని వాజ్‌పేయి ఐరాస వేదిక నుంచి పాకిస్తాన్‌పై గట్టిగానే రుచుకుపడినప్పటికీ పాకిస్తాన్‌పేరును నేరుగా ప్రస్తాంచలేదు. అయితే ముషారఫ్ మాత్రం భారత్కు ధీటుగానే సమాధానం ఇచ్చారు. ముంతదాచకుండా బహిరంగంగానే కాశ్మీర్ షయం ప్రస్తాస్తూ భారత్‌పై దుమ్మెత్తిపోశారు.












Click it and Unblock the Notifications