టెహ్రాన్‌ః ఒసామాబిన్ లాడెన్, తాలిబన్ నేత ముల్లా ఓమర్ శుక్రవారం నాడు పాకిస్తాన్ పారిపోయినట్లు ఇరాన్ రేడియా ప్రకటించింది. ఆఫ్ఘన్ యుద్ధానికికారకులైన ఇద్దరు కీలక వ్యక్తులు పాక్ సరిహద్దులోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయినట్లు రేడియో వెల్లడించింది. నార్తరన్ అలయెన్స్‌సేనలు కాందహార్ ను స్వాధీనం చేసుకోవడం ఖాయం అని తేలిపోవడంతో ముల్లా ఓమర్, లాడెన్ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోయినట్లు చెబుతున్నారు.
లాడన్ పట్లఅపారమైన సానుభూతి వున్న పాకిస్తాన్ లోని పెషావర్ నైరుతిభాగంలోని గ్రామాలకు ఒక వాహనంలో పారిపోయినట్లు ఇరాన్ రేడియో తెలిపింది. ఓమర్, లాడెన్ వెళ్ళినపెషావర్ లోని ఆ ప్రాంతంపై పాక్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టు లేకపోవడంతో పాటు తాలిబన్ సానుభూతి పరులు కూడా అక్కడ పుష్కరంలగా వున్నారు. ఇరాన్ ప్రభుత్వం నడిపేజామ్ ఎ జామ్ పత్రిక కథనం ప్రకారం లాడెన్ పాక్ ఆక్రుత కాశ్మీర్ లో తలదాచుకోవడానికి వెళ్ళాడనిపేర్కొన్నది.












Click it and Unblock the Notifications
